





గ్రూప్‌లో, NSE & BSEలో వర్తకం చేస్తున్న పది లిస్టెడ్ కంపెనీలతో కలిపి 29 వ్యాపారాలు ఉన్నాయి. చెన్నైలో ప్రధాన కార్యాలయం కలిగిన ఈ గ్రూప్‌లోని ప్రధాన కంపెనీలు - కార్బోరండమ్ యూనివర్సల్ లిమిటెడ్, CG పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్, చోళమండలం ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్, చోళమండలం MS జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కోరమాండల్ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్, E.I.D. ప్యారీ (ఇండియా) లిమిటెడ్, ప్యారీ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, శాంతి గేర్స్ లిమిటెడ్, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు వెండ్ట్ (ఇండియా) లిమిటెడ్.
అబ్రెసివ్స్, టెక్నికల్ సెరామిక్స్, ఎలక్ట్రో మినరల్స్, ఆటో కాంపోనెంట్స్ & సిస్టమ్స్, పవర్ కన్వర్షన్ ఎక్విప్‌మెంట్, ట్రాన్స్‌ఫార్మర్స్ & రియాక్టర్స్ ఫర్ పవర్ T&D సెగ్మెంట్, రైల్వేస్ కోసం రోలింగ్ స్టాక్ & సిగ్నలింగ్ ఎక్విప్‌మెంట్, సైకిల్స్, ఫెర్టిలైసర్స్, షుగర్, టీ మరియు స్పిరులినా (న్యూట్రాస్యూటికల్స్) వంటి అనేక ఉత్పత్తులలో గ్రూప్ ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. గ్రూప్ చిమిక్ ట్యునీసియన్, ఫోస్కోర్, మిట్సుయ్ సుమిటోమో, మోర్గాన్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, యన్మార్ & కో. మరియు డెస్ ఫాస్ఫాట్ డి గఫ్సా (CPG) వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలతో గ్రూప్ బలమైన పొత్తులను ఏర్పరచుకుంది. గ్రూప్ భారతదేశం అంతటా విస్తృతమైన భౌగోళిక ఉనికిని కలిగి ఉంది మరియు 6 ఖండాలలో విస్తరించి ఉంది.
బిఎస్ఎ, హెర్క్యులస్, మోంట్రా, మాక్ సిటీ, బాల్మాస్టర్, అజాక్స్, రోడియస్, ప్యారీస్, చోళ, గ్రోమోర్, శాంతి గేర్స్ మరియు పరంఫోస్ వంటి ప్రఖ్యాత బ్రాండ్‌లు మురుగప్ప స్టేబుల్‌కు చెందినవి. గ్రూప్ ప్రొఫెషనల్ ప్రవృత్తి యొక్క వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది మరియు 83500+ కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది.

మొబిలిటీ సొల్యూషన్‌ల నుంచి మొదలుకొని మెటల్స్ అంతటా విస్తరించిన పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్న, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (TII) దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కంపెనీలలో ఒకటి.
సైకిల్స్ తయారీలో ఇది ప్రముఖమైన సంస్థ, విస్తృతమైన పరిశ్రమలకు ట్యూబ్స్ , మెటల్ ఫార్మ్డ్ ప్రొడక్ట్స్ మరియు చైన్స్ సరఫరా చెయ్యడంలో ముఖ్యులు. TII, ప్రధాన OEMలకు సేఫ్టీ - క్రిటికల్ ప్రెసిషన్ భాగాలను సరఫరా చేస్తుంది మరియు పవర్ సెక్టార్, ఆఫ్-రోడ్ అప్లికేషన్స్ , టెక్స్‌టైల్ మెషినరీ మరియు జనరల్ ఇంజనీరింగ్ విభాగాలలో బలమైన ఉనికిని కలిగి ఉంది.
కంపెనీ 'డైమండ్' బ్రాండ్‌తో ఆటోమోటివ్ మరియు ఇండస్ట్రియల్ చైన్‌లలో అగ్రగామిగా ఉంది. హై ప్రెసిషన్ మరియు ప్రపంచ నాణ్యత ప్రమాణాలను స్థిరంగా అందించగల సామర్థ్యం, కంపెనీలో ఎగుమతులు పెరగడానికి దారితీసింది. Tl I భారతదేశంలో సైకిల్ రిటైలింగ్‌లో అగ్రగామిగా ఉంది. BSA, హెర్క్యులస్, లేడీబర్డ్, రోడియో, మంత్ర మరియు మాక్ సిటీ వంటి ప్రతిష్టాత్మక బ్రాండ్‌లు స్థిరంగా ఉన్నాయి. TII మరియు దాని అనుబంధ సంస్థ శాంతి గేర్స్ లిమిటెడ్ ద్వారా, భారతదేశంలో పారిశ్రామిక గేర్స్ విభాగంలో పనిచేస్తోంది మరియు తన ఆటోమోటివ్ ఇంజనీరింగ్ ఉనికిని మరింత బలోపేతం చేయడానికి CG పవర్‌ను కొనుగోలు చేసింది.